రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి శ్రీథర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లకు ఎవరు వచ్చినా దాడులు చేయాలని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులపై దాడులు చెయ్యమని చెప్పింది ఎవరో వీడియోలో స్పష్టంగా ఉందని
శ్రీధర్‌బాబు చెప్పారు. కలెక్టర్, కడా ఛైర్మెన్‌ను చంపే ప్రయత్నం చేశారని ఆవేదన చెందారు. పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక చిహ్నమని, ప్రగతికోసం ఆయా ప్రాంత ప్రజలను మెప్పించి మాట్లాడతామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయా ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్‌ఎస్ కుట్ర : మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement with us -