28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

పెద్దపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఉదయం సుమారు 7:27 గంటల నుంచి 7:30 గంటల మధ్య సమయంలో కొన్ని సెకండ్ల పాటు బీకర శబ్దంతో పాటు భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్, రామగిరి మండలాలతో పాటు గోదావరిఖని ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇండ్లలో సామాన్లు కదిలి శబ్దం చోటు చేసుకోవడంతో జనం ఉలిక్కిపడ్డారు. ఆ బీకర శబ్దంతో పాటు భూమి కంపించడం తో ఆ సమయంలో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్వల్పంగా భూమి కంపిచడంతో ప్రస్తుత సమాచారం వరకు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిలోనట్టు తెలిసింది. జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో భూప్రకంపనల కలకలం చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించిదని చెబుతున్నారు. అలాగే, ఇటు.. సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోనూ భూకంపం ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడ ఐదు సెకనుల పాటు భూమి ఊగిందని చెబుతున్నారు.ఇళ్లలో ఉన్న సామాన్లు కింద పడ్డాయి. సీసీ కెమెరాల్లో భూ ప్రకంపనల దృశ్యాలు రికార్డయ్యాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com