పుష్ప-2 వచ్చేసింది. సినిమా థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్‌ను కేరింతలు కొట్టిస్తోంది. ఎక్కడికక్కడ సినిమా షోలు ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర రాత్రినుంచే అభిమానుల జోష్ కనిపించింది. అర్థరాత్రి బెనిఫిట్ షోలు మొదలయ్యే సరికి రద్దీ పీక్స్‌కు చేరింది. ఒక్కో,చోట ఫ్యాన్స్ తమకు తోచిన రీతిలో బన్నీ పుష్ప-2కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈకోణంలోనే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్లో పుష్ప-2 గెటప్‌లో అల్లు అర్జున్ అభిమాని సందడి చేశాడు. ఈ పరిణామం ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది.