37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

పులుల రక్షిత ప్రాంతాలపై మంత్రి సమీక్ష

డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి, టైగర్ రిజర్వ్ గవర్నింగ్ బాడీస్ చైర్ పర్సన్ శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ల గవర్నింగ్ బాడీస్ సమావేశం జరుగుతున్నది. పులుల రక్షిత ప్రాంతాల పరిధిలో గ్రామాల తరలింపు, పులుల రక్షణ, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి వస్తున్న పులుల పట్ల అటవీ శాఖ అనుసరించాల్సిన విధానలపై మంత్రి సమీక్షిస్తున్నారు.

ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డిసిసిఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), సిఎఫ్ రాంబాబు (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), శాంతారాం(కవ్వాల్ టైగర్ రిజర్వ్), డిఎఫ్ఓలు రోహిత్ (నాగర్ కర్నూల్), బాజీరావ్ పాటిల్ (ఆదిలాబాద్), రాజశేఖర్ (నల్గొండ), ఎఫ్ డిఓ రామ్మూర్తి, ఓఎస్డీ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com