ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీల స్థితిగతులపై ఇవాళ, రేపు బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ.కొనసాగనుంది. ఇవాళ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్‌లకు అవకాశం కల్పించారు. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగనుంది.