29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

నాగ్‌చైతన్య శోభితల వివాహం…ముహూర్తం డిసెంబర్‌ 4

నాగ చైతన్య  శోభిత పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. చై కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

నటి శోభితతో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న చైతూ… పెళ్లి పీఠలు ఎక్కే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబరు 4న నాగ్ చైతన్య – శోభిత ఒక్కటికాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదిక వీరి వివాహ వేడుక జరగబోతుందని నాగార్జున ప్రకటించారు. ఆకట్టుకునే పెళ్లి పందిరి డిజైన్‌ చేస్తున్నారని, దీనికి సినీరంగానికి చెందిన ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే తన ఫ్రెండ్స్‌కు నాగచైతన్య శుభలేఖలు కూడా ఇచ్చేసారని తెలుస్తోంది. గత కొంతకాలంగా స్నేహబంధం కొనసాగిస్తున్న శోభిత – చైతూ జంటకు ఇటీవల ఇరుకుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది.

శోభిత దూళిపాళ ఇంట్లోనూ పెళ్లిపనులు మొదలైపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తదుపరి చిత్రం తండేల్‌లో చైతూ బిజీగా ఉన్నారు. వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com