24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

నవంబరు 24న ‘పుష్ప-2’ కిస్సిక్‌ సాంగ్‌ విడుదల

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్‌.. చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్‌.. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్‌ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన బిగ్గెస్ట్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కనివిని ఎరుగుని జనసంద్రంతో.. ఉప్పొంగిన జనవాహిని సమక్షంలో.. దాదాపు మూడు లక్షల వరకు హాజరైన అభిమానుల సమక్షంలో ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2’ దిరూల్‌ ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నట విశ్వరూపం డిసెంబరు 5న ప్రపంచమంతా చూడబోతుంది. దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌… కల్డ్‌ మాస్‌ మేకింగ్‌ గురించి మాట్లాడుకోబోతున్నారు. ఈ చిత్రంలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక పాట అప్‌డేట్‌ వచ్చేసింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలపై చిత్రీకరించిన ఈ పాటను ఈ నెల 24న చెన్నయ్‌లో జరగనున్న గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ కిస్సిక్‌ సాంగ్‌ను గ్రాండ్‌గా ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు. డ్యాన్సుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కథానాయిక శ్రీలీల ప్రత్యేక గీతం అంటే ఇక ఫ్లోర్‌ ఫైరే… ఈ సాంగ్‌ పుష్ప-2లో మరో సన్సేషన్‌ సాంగ్‌గా నిలవబోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com