28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేరు మార్పు

హైదరాబాద్‌ కోఠి ఉమెన్స్‌ కాలేజీ ప్రాంగణంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పేరు మారింది. యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శాసనమండలిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశపెట్టారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. ఆమె చేసిన పోరాటం ఎంతోమంది మహిళలకు స్పూర్తి అని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com