సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి.. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.