తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య టైమ్ టేబుల్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి మొదలవుతాయి. 25వ తేదీతో ముగుస్తాయి. మార్చి 5వ తేదీ బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. 7వ తేదీ శుక్రవారం పార్ట్ 1 ఇంగ్లీష్, 11వ తేదీ మంగళవారం పార్ట్ -3 పరీక్ష మాథమ్యాటిక్స్ పేపర్ 1ఎ, బొటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 13వ తేదీ గురువారం మాథమ్యాటిక్స్ పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక, 17వ తేదీ సోమవారం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరుగుతాయి. 19వ తేదీ బుధవారం కెమిస్ట్రీ, కామర్స్, 21వ తేదీ శుక్రవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బైపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు, అలాగే, 24వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలతో ఫస్టియర్ పరీక్షలు ముగుస్తాయి.
ఇక, ఇంటర్మీడియట్ సెకండియర్ చూస్తే.. మార్చి 6వ తేదీ గురువారం సెకండ్ లాంగ్వేజ్, 10వ తేదీ సోమవారం ఇంగ్లీష్, 12వ తేదీ బుధవారం మాధమ్యాటిక్స్ పేపర్ 2ఎ, బొటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. 15వ తేదీ శనివారం మాధమేటిక్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు నిర్వహిస్తారు. 18వ తేదీ మంగళవారం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 20వ తేదీ గురువారం కెమిస్ట్రీ, కామర్స్ 22వ తేదీ శనివారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బైపీసీ విద్యార్థులకు మాథ్స్ బ్రిడ్జికోర్సు, 25వ తేదీ మంగళవారం మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు జరుగుతాయి.
ఇక, జనవరి 29వ తేదీన బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్‌కు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. జనవరి 30వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుంది. అలాగే, జనవరి 31వ తేదీన ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్, ఫిబ్రవరి 1వ తేదీన సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జనరల్, వొకేషనల్ విద్యార్థులందరికీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.