ఎంపీ డీకే అరుణ కొడంగల్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ రగడ, దాడులు, అరెస్టులు, ఉద్రిక్తత నేపథ్యంలో డీకే అరుణ ఇవాళ లగచర్ల వెళ్లారు. అయితే, మధ్యలోనే డికె అరుణను పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ వద్ద డీకే అరుణను అడ్డుకొని లగచర్లకు వెళ్లొద్దంటూ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని ముందుకు వెళ్లనీయబోమని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరును నిరసిస్తూ డీకే అరుణ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. డీకే అరుణ రోడ్డుపై బైఠాయించడంతో ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో, మన్నెగూడ వద్ద ఉద్రిక్తత నెలకొంది.