36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన కొలంబియా..

దేశంలో అక్రమ వలసదారులను పంపించేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇప్పుడా పనిని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే డీపోర్టేషన్‌ను స్పీడప్ చేసింది అమెరికా. అయితే అనూహ్యంగా డీపోర్టేషన్‌ కోసం సైనిక విమానాలను వాడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ట్రంప్ ఆదేశాలను మొదట కొలంబియా పట్టించుకోలేదు. అక్రమ వలసదారులతో వచ్చిన అమెరికా విమానాలకు ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వలేదు కొలంబియా. దీంతో ట్రంప్ తన పన్నుల ఆస్త్రాన్ని బయటికి తీసి కొలంబియాపై ప్రయోగించారు. దీంతో కొలంబియా దిగిరాక తప్పలేదు.

అమెరికాలో ఉన్న కొలంబియాకు చెందిన అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో పంపింది అమెరికా. అయితే దీనిపై చాలా తీవ్రంగా స్పందించారు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో. వలసదారులను తీసుకొచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ విమానాలు వెనక్కి వచ్చాయి. వలసదారులు నేరస్థులు కాదని.. వారి చేతులకు సంకేళ్లు ఎందుకు? సైనిక విమానాలు ఎందుకు? వారిని అమెరిక డొమెస్టిక్ విమానాల్లో పంపాలని.. అప్పుడే వారికి స్వాగతం పలుకుతామన్నారు.

కొలంబియా నుంచి ఈ రిప్లై రాగానే కొలంబియాపై 50 శాతం టారీఫ్‌లు పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు కొలంబియా ప్రభుత్వాధికారుల వీసాలను కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ చర్యలు ఆరంభం మాత్రమే అని.. ఇక ముందు ముందు చాలా తీవ్రమైన చర్యలుంటాయన్నారు. దీంతో కొలంబియా దిగిరాక తప్పలేదు. దీంతో టారీఫ్‌ల పెంపు నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు వైట్‌హౌజ్ ప్రకటించింది.

అయితే అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై లాటిన్ అమెరికా దేశాలు కూడా ఇలానే స్పందించాయి. మెక్సికోకు సైనిక విమానాల్లో కొందరిని డీపోర్ట్‌ చేయాలని చూసింది అమెరికా. కానీ ఆ దేశం అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన నాలుగు విమానాల్లో పంపించింది.

బ్రెజిల్ కూడా వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేయడాన్ని తప్పు పట్టింది. గ్వాటెమాలాకు ఇప్పటికే 160 మందిని డిపోర్ట్ చేశారు. అయితే ఇకముందు భారతీయుల వంతు కూడా వచ్చే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com