28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి తొలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలో నేతలు రాజకీయ విషయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టాలని తీర్మానించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేస్తూ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం.. 20 నుండి 30 గంటల దాకా సమయం పడుతున్నందున ఏఐ టెక్నాలజీ వినియోగించి.. భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. తిరుమలలో అన్య మతస్తులకు వీఆర్ఎస్ తీసుకునేలా ఆప్షన్‌ ఇస్తామని, లేదంటే ప్రభుత్వానికి అటాచ్ చేయాలని తీర్మానం చేశారు. తిరుమల డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను ఆరు నెలల్లో క్లీన్ చెయ్యాలని నిర్ణయించారు. తిరుపతిలో ప్లైఓవర్‌కి గరుడవారధిగా పేరు పెట్టనున్నారు. ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు దర్శన సదుపాయం కల్పించనున్నారు. ప్రైవేట్ బ్యాంకులలో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకులకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యమైనదిగా ఉండాలని నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.టిటిడి నిబంధనలు పాటించని కారణంగా తిరుమల శారదా పీఠం మఠాన్ని టిటిడి స్వాధీనం చేసుకోకోవాలని నిర్ణయించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com