జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో లోని మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర శాసన బృందంతో పాటు సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా నివాళులర్పించారు. ఆస్ట్రేలియా లోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం స్టడీ టూర్ లలో భాగంగా తెలంగాణ శాసన బృందం న్యూజిలాండ్‌లో పర్యటించి అనంతరం జపాన్ చేరుకుంది.