28.2 C
Hyderabad
Friday, August 14, 2026

Live Video

spot_img

జగిత్యాల పురపాలక సంఘంలో ఇంటిదొంగలు

జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో భూ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. భూముల రేట్లు పెరగడంతో భూ దందాలు సెటిల్మెంట్లకు గ్యాంగులు పెరిగిపోతున్నాయి. జగిత్యాల పరినర ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. ఖాళీ స్థలంలో కొన్ని రోజుల నుండి ఎవరు లేరని నిర్ధారణకు వచ్చాక వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని దానికి అనుగుణంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఖాళీ స్థలంలో ఇల్లు ఉన్నట్టు చూపిస్తూ ఆన్లైన్ లో ఇంటి నెంబరు ఆ స్థలంలో లేని ఏదో ఒక ఇంటి ఫోటోను అప్లోడ్ చేస్తున్నారు.

అధికారులతో కుమ్మక్కై ఆయా స్థలంలో ఇల్లు లేకున్నా ఇల్లు ఉన్నట్లు ఎక్కడో ఉన్నది అప్లోడ్ చేసి ఇంటి నెంబర్ తీసుకొని ప్రాపర్టీ టాక్స్ రిసిప్ట్. ముటేషన్ తీసుకొని ఆ ప్రాపర్టీ టాక్స్ డాక్యుమెంట్ ఆధారంగా ఇంటి నెంబర్ అసెస్మెంట్ నెంబర్ చూపిస్తూ సల్ రిజిస్టర్ కార్యాలయంలో సంబంధిత వ్యక్తులపై రిజిస్ట్రేషన్  చేయిస్తున్నారని సమాచారం. రిలీజ్ డీట్, సెల్ డిడ్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తీసుకొని ఆ ఖాళీ స్థలం డాక్యుమెంట్లను దొంగతనంగా తయారుచేసి ఆ స్థలం తమదేనంటూ చలాయిస్తున్నారు.

వీధి రౌడీలతో కబ్జాలోకి వచ్చి నిజమైన ఓనర్ లను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠాలు రోజురోజుకు పట్టణంలో పెరిగిపోతున్నాయి. మున్సిపల్ శాఖ ఇంటికి సంబంధించిన ఇంటి నెంబరు ఇవ్వడానికి సామాన్య ప్రజలను పలు రకాల పత్రాలు కావాలని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇవ్వని వైనం ఒకవైపు… మరొకవైపు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా వీరికి ఎవరైతే మధ్యవర్తి ద్వారా ముడుపులు ఇస్తారో వారికి ఇంటి నెంబర్ ఇవ్వడం దాని ద్వారా ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించడం స్థలం యొక్క యజమానిని నష్టపరచడం షరా మాములైంది. గతంలో పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా సిబ్బందిలో మార్పు రాకపోవడం గమనార్హం. ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు జరగకపోవడం ప్రభుత్వాలు మారినా అధికారులు మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com