జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. విజయవాడ గాంధీనగర్ బీఆర్‌టీఎస్ రోడ్‌లోని శ్రీ శృంగేరీ శారదా పీఠంలో ఈ రోజు(మంగళవారం) స్వామి వారిని వైెఎస్.జగన్ దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్.జగన్ తో పాటు స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ విజయవాడ ఈస్ట్ ఇంచార్జ్ దేవినేని అవినాష్ సహా పలువురు నాయకులు ఉన్నారు.