39.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దక్షిణ సుక్మాలోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జిల్లా రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య ఈరోజు(శుక్రవారం) ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారని సమాచారం. పోలీసుల వైపు ఎంత నష్టం జరిగింది తెలియాల్సి ఉంది.

ఉదయం నుంచి ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిరణ్‌ చవాన్‌ ధృవీకరించారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్‌ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్గులు ఇద్దరిని హత్య చేశారు. మృతులు అర్జున్, రమేష్ గా గుర్తించారు. మృతుడు రమేష్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com