విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో గాయపడ్డ వాళ్ల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో పలువురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.దీంతో, తాజా పరిస్థితి ఎలా ఉందని సీఎం అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయి ఒకరు చనిపోయారని, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. వాళ్లకు క్రిటికల్ కేర్ సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి కూడా చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులుకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.
- Advertisement with us -