28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

కోటి దీపోత్సవ వేడుకలు అభినందనీయం… రేవంత్ రెడ్డి

ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగించి సమాజానికి మేలు చేస్తుంది… అలాంటిది కోటి దీపాలను వెలిగిస్తే ఇంకెంతో మంచి జరుగుతుందని తెలంగాణ సీయం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటీ దీపోత్సవ ఆద్యాత్మిక వేడుకలకు సీయం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా కోటి దీపోత్సవం నిర్వహించి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన భక్తి టీవీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి సీయం మాట్లాడుత ఆనాటి త్రిలింగ క్షేత్రమే నేటి తెలంగాణ అని వేయి స్తంభాల గుడి, రాజన్న దేవాలయం, అలంపూర్ మల్లిఖార్జున దేవాలయాలతో తెలంగాణ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఆహ్వానించి భక్తులకు వారిచే ఆశీర్వదింపజేసినందుకు తెలంగాణ ప్రజల తరపున నరేంద్ర చౌదరి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వేదికపైన స్వర్ణలింగానికి రజిత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన నిర్వహించిన అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు అవధూత దత్తపీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వచనాలను తీసుకున్నారు. తర్వాత జ్వాలతోరణ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి వారితో కలిసి వేదికపై కార్తీక దీపారాధన చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com