పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీష్‌రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు.. హరీష్‌రావపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు తన ఫోన్ టాప్ చేయించారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. హరీష్‌రావతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని పిటిషన్‌లో హరీష్‌రావు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు.. తనకు సంబంధం లేని కేసులో ఇరికించారని హరీష్‌రావు వివరించారు. తనపై నమోదైన కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు హైకోర్టును కోరారు.