- 60 సంవత్సరాల నుంచి 62 ఏండ్లకు
- మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందే క్యాబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరికొంత కాలం తీసుకోవడం వల్ల పరిపాలన మెరుగు పడుతుందని కేంద్రం భావిస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ వయో పరిమితి పెంచాలనే ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందు కేంద్ర క్యాబినేట్ వయోపరిమితి పెంపు ప్రతిపాదనను ఆమోదించడం ఆశక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి మండలి తీసుకున్న ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అములలోకి వస్తుంది. కేంద్రప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యకుండా పదవీ విరమణ పొందాల్సిన ఉద్యోగులను మరో రెండేళ్ళు కొనసాగించేలా రిటైర్మెంట్ వయసు పెంచడం పట్ల నిరుద్యోగుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.