24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

కుర్ కురేల వల్లే విద్యార్థులకు అస్వస్ధత

హైకోర్టుకు నివేదించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కుర్ కురే తినడం వల్లే అస్వస్ధతకు గురయ్యారని రాష్ట్ర హైకోర్టుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ నివేదిక ఇచ్చారు. బుధవారం ఉదయం మాగనూరు ఘటనపై హైకోర్టు సీరియస్ అయి… మధ్యాహ్నానికల్లా ఘటనపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్లీడర్ ను ఆదేశించింది. కుర్ కురే వల్ల పిల్లలు అస్వస్ధతకు గురయ్యారని ప్రభుత్వ ప్లీడర్ హైకోర్టుకు నివేదిక అందించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలియజేశారు. అడిషనల్ అడ్వకేట్ నివేదికను పరిశీలించిన హైకోర్టు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మాగనూరు ఘటనతో పాటు కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి ఘటనపై కూడా బాధ్యులపై తీసుకున్న ఏంటో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపాలని… సోమవారం లోపు ఆ నివేదికలను కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com