ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో నెట్ లో హల్ ఛల్ చేస్తోంది. ఖమైనీ తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖొమైనీని రహస్యంగా జరిగిన ఒక సమావేశంలో తన వారసుడిగా నియమించినట్లు గత అక్టోబర్ మాసంలోనే పలు అంతర్జాతీయ మీడియా సంస్ధలు కధనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తాను లెబనాన్ లోని ఇరాన్ రాయబారి మొజ్తబా అమనితో లెబనాన్ లో భీటీ అయినట్లు స్వయంగా ఖొమైనీనే ఎక్స్ లో ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఖొమైనీ రాయబారి అమనితో చర్చిస్తున్నట్లు, ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడవుతోంది. గతంలో లెబనాన్ పై ఇజ్రాయిల్ జరిపిన పేజర్ బాంబుల దాడిలో ఇరాన్ రాయబారి అమని గాయపడిన విషయం తెలిసిందే.