అధికార ఎన్డీయే పక్షంలోని బీజేపీ తన లోక్‌సభ ఎంపీలకు విప్ జారీచేసింది. ఈనెల 13, 14 తేదీల్లో లోక్‌సభ సభ్యులందరూ తప్పనిసరిగా సమావేశాలకు మాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఎంపీలంతా సమావేశాలకు హాజరవుతున్నారు. బీజేపీ ఎంపీలు కూడా దాదాపు అందరూ సభా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే, ప్రత్యేకంగా ఈనెల 13, 14 అంటే.. శుక్రవారం, శనివారాల్లో తప్పనిసరిగా లోక్‌సభకు హాజరు కావాల్సిందేనంటూ బీజేపీ అధిష్టానం విప్ జారీ చేయడం చూస్తుంటే కీలకమైన అంశాలు ఈ రెండురోజుల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా దేశంలో జమిలి ఎన్నికలపై కేంద్రప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది. ఈ అంశం ఏమైనా లోక్‌సభలో ఈ రెండురోజుల్లో చర్చించే పరిస్థితి ఉంటుందా? అన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.