26.7 C
Hyderabad
Saturday, October 10, 2026

Live Video

spot_img

ఉప ముఖ్యమంత్రిని సత్కరించిన బీసీ ఉద్యోగులు

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేయిస్తున్నందుకు ఉద్యోగ జేఏసీ, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం ఉదయం ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్కను కలిసిన ఉద్యోగ సంఘాలు మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటాన్ని బహూకరించి..భారీ గజమాల, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా నేటినుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కార్నివాల్ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేకు సంపూర్ణ సహకారం అందించి భాగస్వామ్యమైన ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. కుల గణన పూర్తి తర్వాత ప్రభుత్వం తయారు చేసే సమగ్రమైన యాక్షన్ ప్లాన్‌లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రం మన అందరిదని, ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, దేవరకొండ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com