తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో చోటు చేసుకున్న భూ ప్రకంపనల ఆనవాళ్లు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూడా కనిపించాయి. బుధవారం ఉదయం 7:27 నిమిషాల నుండి 7:28 నిమిషాల మధ్య కొన్ని సెకనుల పాటు భూమి కంపించింది. సుమారు ఐదు సెకనుల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. దీంతో, జనం ఉలిక్కిపడ్డారు. అయితే, తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రజలు, అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకున్నారు.