30.7 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

బీఆర్‌ఎస్‌ ధర్నాకు హైకోర్టు అనుమతి

మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించతలపెట్టిన ధర్నా కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గిరిజన రైతు ధర్నా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. సోమవారం ధర్నా చేపట్టాలని ప్లాన్‌ చేసింది. అయితే, పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో, బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ నేతల అభ్యర్థన మేరకు హైకోర్టు గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేపట్టేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరుచేసింది. అయితే, సభలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని పరిమితి విధించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com