వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసులో ప్రధాన ముద్దాయి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని చర్లపల్లి జైలు సూపరింటెండ్ ను హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇదే అంశంపై నరేందర్ రెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ని కోర్టు తిరస్కరించింది అయితే తాజాగా వేసిన పిటీషన్ అనుమతించిన హైకోర్టు నరేందర్ రెడ్డిని ఇతర ఖైదీలతో కాకుండా ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని కూడా అనుమతించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.