ఎంతమంది పిల్లలు ఉన్నా పట్టణ స్థానిక సంస్ధల్లో పోటీ చెయ్యడానికి అర్హత ఉండేలా నిబంధనలను మారుస్తూ సోమవారం బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మరియు పట్టణభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం అసెంబ్లీలో 2024 సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. జనాభావృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే మున్సిపల్ చట్టంలో ఈ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. శాసనమండలిలో కూడ ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వం జీఓ జారీ చేస్తుంది. అనంతరం కొత్త సవరణ అమలులోకి వస్తుంది. గతంలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్ధల్లో పోటీకి అనర్హత ఉండేది. తాజా సవరణ బిల్లుతో ఇకపై పట్టణ స్థానిక సంస్ధల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి ఎటువంటి ఆటంకాలు ఉండవు.
- Advertisement with us -