అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి గట్టి షాక్ ఇచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. కెనడా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు 25 శాతం టారీఫ్‌లు పెంచాయి. అయితే చర్చలతో ఈ టారీఫ్‌ల పెంపుకు బ్రేక్ పడింది. కానీ చైనా మాత్రం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పాటే.. అమెరికా నుంచి చైనాలోకి దిగుమతయ్యే వస్తువులపై 15 శాతం టారీఫ్‌లు పెంచింది. ఓ వైపు ఫిర్యాదు చేస్తూనే.. మరోవైపు ట్రేడ్ వార్ షురూ చేసింది.
అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బొగ్గుపై 15 శాతం, న్యాచురల్ గ్యాస్‌పై 10 శాతం పన్ను విధించింది చైనా. అదే విధంగా ఇతర వ్యవసాయ పనిముట్లపై కూడా సుంకం విధిస్తునట్లు ప్రకటించింది. అయితే టారిఫ్ లతో పాటు అమెరికాపై గట్టి దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ స్కెచ్ వేసింది. టంగ్ స్టన్ సంబంధిత వస్తువలను యూఎస్ భారీగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడీ ఎగుమతులను తగ్గించేలా చర్యలు మొదలు పెట్టింది చైనా.
ఇదొక్కటే కాదు.. అమెరికాను కంట్రోల్ చేసేందుకు చాలా చర్యలే తీసుకుంటుంది. ఇప్పటికే చైనాలో గూగుల్ సంస్థపై విచారణకు సిద్ధమైంది. చైనాకు సంబంధించిన కీలక డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణతో గూగుల్ సంస్థను ఇన్వెస్టిగేట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ట్రంప్ టారిఫ్ లు విధించడం.. ఇప్పుడు అమెరికాకే రివర్స్ రియాక్షన్స్ వస్తుండటంతో సీన్ అంతా మారిపోయింది. సై అంటే సై అన్నట్లుగా కెనడా, మెక్సికో దేశాలు… అమెరికాపై పన్నులు విధించడంతో కాస్త తగ్గి నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్. ఇప్పటికే తాము కూడా అమెరికాపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. 155 బిలయన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారీఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించారు జస్టిన్ ట్రూడో. మెక్సికన్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో అమెరికాకు షాక్ తగిలే చాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే అధికారికంగా ట్రేడ్ వార్ మొదలైపోయింది.