26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

గుత్తా జ్వాలకి కోపం తెప్పించిన ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌

– మీ భార్య ముఖాన్ని చూడాలనుకోడం లేదా?
– సుబ్రహ్మణ్యన్ కు గుత్తా జ్వాల సూటి ప్రశ్న..
– ఫైవ్‌ డే వర్క్ కల్చర్ పై తీవ్ర చర్చ
– వీక్ ఆఫ్‌ కూడా అక్కర్లేదన్న ఎల్‌ అండ్ టీ ఛైర్మన్
– మండిపడిన మహిళా సెలబ్రిటీలు
– ఆడవారి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలన్న గుత్తా, దీపికా

 

ఉద్యోగుల వర్కింగ్‌ అవర్స్ పెంచాలని పనిలో ఏకాగ్రత సాధించడం ద్వారా దేశానికి అధిక సంపద సృష్టించవచ్చని మనదేశంలో సాఫ్ట్ వేర్ రంగాల దిగ్గజాలు ఎప్పుడో శెలవిచ్చారు. ఉద్యోగుల పనివేళలను పెంచడం ద్వారా దేశ జీడీపీ పెంచొచ్చన్న ఇన్పోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కామెంట్లపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఫైవ్‌ డే వీక్‌ ను ప్రతిపాదిస్తే..అసలు ఆ వీకాఫ్ కూడా అక్కర్లేదు అన్న రీతిలో ఎల్‌ అండ్ టీ ఛైర్మన్‌ వివాదాస్పద కామెంట్లకు దారి తీసింది. దీనిపై బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల తీవ్రంగా స్పందించారు.ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వర్క్ లైఫ్‌ బ్యాలెన్స్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఆయనేమన్నారంటే..

క్వాలిటీ వర్క్ అందాలంటే సాఫ్ట్ వేర్ రంగాలలో వారానికి 70 గంటల పని (ఫైవ్‌ డే వీక్‌) కాన్సెప్ట్ ను అమలుచేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్‌ నారాయణమూర్తి అభిప్రాయాలపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.ఇదే అంశంపై స్పందించిన ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రమణ్యన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90గంటల పనిదినాలు చేస్తేనే ఫలితముంటుందని, సంపద సృష్టి సాధ్యమని అన్నారు. నా ఉద్యోగులను ఆదివారం కూడా పనిచేయించాలని నేను తపన పడుతున్నాను.. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తాను కాబట్టి.. నా ఉద్యోగులంతా ఆదివారాలు కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. అయినా ఇంటి దగ్గర ఏం తోస్తుంది మీకు? ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? పెళ్లాల ముఖాలు ఎంతసేపు చూడగలరు ?అదేదో ఆఫీస్‌ లో కూర్చోండి.. రండి.. ఆఫీసులకి రండి.. పని చేయండి అంటూ కామెంట్ చేశారు. నెట్టింట్లో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది..

మీ భార్య ముఖం చూడకూడదనుకున్నారా?

దీనిపై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఘాటుగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో మీభార్య ముఖాన్ని మీరెందుకుచూడకూడదు అనుకుంటున్నారు అంటూ ఘాటుగా ప్రశ్నించింది.లేదా కేవలం ఆదివారం మాత్రమే భార్య ముఖాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నారు అని జ్వాల ప్రశ్నించారు. సుదీర్ఘ గంటల పాటు పనిదినాలు ఉద్యోగుల శారీరక,మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని, ఉద్యోగుల ఆరోగ్యంపై వారికి శ్రద్ధ ఉండదా అనీ స్పందించారు.ఇక బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే కూడా సీరియస్ గా రియాక్టయ్యారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలలో కీలక పదవుల్లో ఉన్న వారు ఇలా మాట్లాడటం ఏంటని ఆశ్చర్య పోయారు.ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ నుంచి ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు ఊహించలేదన్నారు. ఇది మహిళలని కించపరచడమేనని సోషల్‌ మీడియాలో అభిప్రాయం వ్యక్తమైంది.

రెస్ట్ మస్ట్

వారానికి 90గంటల పని విధానంపై కార్పొరేట్‌ కంపెనీల అధిపతులుకూడా నెగటివ్ గానే స్పందించారు. ఉద్యోగులకు మానసిక, శారీరక ఆరోగ్యం అత్యంత అవసరమని, జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ అడుగులేయడం అనివార్యమని హర్ష గోయెంకా లాంటి నేతలు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితం, వృత్తి గత జీవితం రెండూ సమన్వయం చేసుకునే అడుగులేయాలని ఆయన అన్నారు.

ఏ సెన్స్ లో అన్నారో అర్ధం చేసుకోండి..

మొత్తానికి నెట్టింట బ్యాక్ ఫైర్‌ అయిన తమ హెడ్‌ ఒపీనియన్‌ పైఎల్‌ అండ్ టీ కంపెనీ కూడా స్పందించింది. ఇది ఉద్యోగులను రాసి రంపాన పెట్టేందుకు ఉద్దేశించినది కాదని,అద్భుతమైన ఫలితాలురావాలంటే ప్రయత్నం కూడా అంత అసాధారణంగా ఉండాలని చెప్పడానికే సుబ్రమణ్యన్‌ అలా అన్నారని, ఆయన వ్యాఖ్యలను విస్త్రృత కోణంలోనే చూడాలని వివరణ ఇచ్చింది. ఇన్ఫోసిస్‌ కో పౌండర్‌ నారాయణన్, ఎల్‌ అండ్ టీ ఛైర్మన్‌ సుబ్రమణ్యన్ ల మీద నెట్టింట మీమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. కొందరు మీమ్‌ పేజీలను కూడా క్రియేట్‌ చేసి కామెంట్లు పెడుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com