చివరికి మద్యంపై ఇచ్చిన హామీని కూడా తప్పి చంద్రబాబు మోసం చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో క్వాలిటీ మధ్యం తక్కువ రేటుకు ఇస్తానని చెప్పి ఇప్పుడు క్వాలిటీ తగ్గించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని అన్నారు. సుమో క్లాసిక్ విస్కీ, కొత్త మద్యం బ్రాండ్లు బెంగళూరు విస్కీ, ట్రాపికానా వీసాప్ బ్రాందీ, రాయల్ లాన్సర్ విస్కీ, షాట్ విస్కీ, బ్రాందీ99, కేరళ మాల్టెడ్ విస్కీ లాంటి ఎక్కడాలేని పేర్లతో కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారని ఎద్దేవా చేశారు. ఇలాగే మహిళల మిస్సింగ్ విషయంలో కూడా లేనిపోని అబద్దాలు చెప్పి 30వేల మంది అమ్మాయిలు అపహరణకు గురయ్యారని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడ్లు ఎన్నకల సమయంలో దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ లో కేవలం 46 మంది మహిళల మానవ అక్రమరవాణా కేసులు నమోదు అయినట్లు శాసనసభలోనే ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించిందని మీడియా సమావేశంలో వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించి కూటమి కుట్రలను ఎత్తిచూపారు. అలాగే 20వ తేదీ వచ్చినా ఇంకా ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్ధితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో విపరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వైఎస్?జగన్ ఆరోపించారు.
- Advertisement with us -