మద్దిపాడు పోలీసులు తనపై పెట్టిన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేసిన పిటీషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారన్న ఆందళన ఉంటే కోర్టులో బెయిల్ పిటీషన్ వేసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఆర్జీవీకి సూచించింది. పోలీసు విచారణకు కూడా కొంత గడువు కావలని చేసిన అభ్యర్ధనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ అభ్యర్ధనను పోలీసుల ముందు ఉంచాలని వ్యాఖ్యానించింది. గతంలో ఆర్జీవీ నిర్దేశకత్వంలో విడుదలైన వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని మద్దిపాడు టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా జారీ చేశారు.
- Advertisement with us -