25.7 C
Hyderabad
Thursday, August 27, 2026

Live Video

spot_img

అక్రమ అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు

సోషల్ మీడియా పోస్టులపై జరుగుతున్న అక్రమ అరెస్టులపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలిలో పట్టుబట్టారు. గురువారం మండలి సమావేశంలో అక్రమ అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టడంతో సభ ఐదు నిమిషాల పాటు వాయిదా వేయాల్సివచ్చింది. అంతకు ముందు దాదాపు ముప్పై నిమిషాల పాటు వైసీపీ ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం కాపాడాలంటూ నినాదాలు చేశారు. పలువురు వైసీపీ శాసనమండలి సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కి అక్రమ అరెస్టులపై చర్చించాలని తమ నిరసనను తెలియజేశారు. మరో పక్క ఇటీవల వైసీపీకి, తమ ఎమ్మెల్సీ పదవులుకు రాజీనామా చేసి పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తమ రాజీనామాలను ఆమోదించాలని మండలిలో ప్లకార్డులు ప్రదర్శించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com