22.4 C
Hyderabad
Monday, October 20, 2025

Live Video

spot_img

జూన్ ఒకటి నుంచి సినిమా హాళ్లు బంద్

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు మూవీ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, సురేశ్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్స్ హాజరయ్యారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య చాలాకాలంగా పర్సంటేజీలపై చర్చ సాగుతోంది. రెంటల్ విధానంలో మూవీస్ ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్స్ వాదిస్తుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్స్ తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీలు, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. పర్సంటైల్ విధానాన్ని గతంలో 3 భాగాలుగా డివైడ్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటిని ఓసారి పరిశీలిస్తే..
రూ.30 కోట్ల కంటే ఎక్కువగా నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ 75 శాతం డిస్ట్రిబ్యూటర్, 25 శాతం ఎగ్జిబిటర్.. సెకండ్ వీక్ 55 శాతం డిస్ట్రిబ్యూటర్, 45 శాతం ఎగ్జిబిటర్.. థర్డ్ వీక్ 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్.. నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్ పర్సంటైల్‌గా ఉండేది.
రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ 60 శాతం డిస్ట్రిబ్యూటర్, 40 శాతం ఎగ్జిబిటర్.. సెకండ్ వీక్ 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్.. థర్డ్ వీక్ 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్.. నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్ పర్సంటైల్‌గా ఉండాలి.
రూ.10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్.. సెకండ్ వీక్ 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్.. థర్డ్ వీక్ 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్‌కు ఉండేది.
అలాగే.. పెద్ద, మీడియం సినిమాలకు 73 శాతం డిస్ట్రిబ్యూటర్, 27 శాతం ఎగ్జిబిటర్ తీసుకునేలా నిర్ణయించారు. తాజాగా.. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్య తేలకపోవడంతో థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల రిలీజ్ అయ్యే మూవీస్‌కు ఈ నిర్ణయం నిజంగా ఇబ్బందే అనే చెప్పాలి.
జూన్‌లో భారీ మూవీస్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న రిలీజ్ కానుంది. అటు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ మూవీ ‘కుబేర’ జూన్ 20న రిలీజ్ కానుంది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సైతం జూన్ 27న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కావాల్సిన టైంలో థియేటర్స్ బంద్ అంటూ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com