- పాకిస్థాన్ కు ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్న జ్యోతి
- ఈమధ్య కాలంలో అనేక సార్లు పాక్ సందర్శన
- అక్కడ పార్టీలు, ఫంక్షన్లలో బిజీ బిజీ
- భారత రక్షణ రంగ సమాచారం కోసం యత్నాలు
- పాక్ లో నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో కీలక పాత్ర
- కేక్ డెలివరీ బోయ్ తో వీడియో.. ఫోటో
- తాజా సాక్ష్యంతో బిగుస్తున్న ఉచ్చు
- పూరీని కూడా సందర్శించిన జ్యోతి
- ఆలయాల సమాచారం, ఫోటోలు షేర్ చేస్తోందా?
- ఇప్పటికే కొంత సమాచారం ఇచ్చిన జ్యోతి
- ఆపరేషన్ సిందూర్ గురించి ఉప్పందించిన జ్యోతి
యుద్ధరీతులు మారిపోతున్నాయి. ఆయుధాలతో యుద్ధం చేయడం ఓల్డ్ స్ట్రాటజీ.ఇప్పుడు స్పైయింగ్ వార్ మొదలైంది. మైండ్ గేమ్ వార్ షురూ అయింది. ఆ కోవలోకే వస్తుంది జ్యోతీ మల్హోత్రా కేసు. నేటి తరహా యుద్ధరీతుల్లో ఒకటైన ఈ పద్ధతిలో తమకనుకూలంగా పాజిటివ్ కథనాలతో ప్రజల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవడం ద్వారా శతృవును దెబ్బ కొట్టడం ఒక పద్ధతి. యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా పాకిస్థాన్ అనుకూల కథనాలు సృష్టించుకోడానికి ఆ దేశానికి ఇక్కడ మూడ్ ని బట్టి కొన్ని ఐడియాలు, కథనాలు ఇచ్చిందని అర్ధమవుతోంది.యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లను పాక్ ఆర్మీ ఇలాగే ముగ్గులోకి దించి ఆయుధంగా వాడుకుంటోందని స్పష్టమవుతోంది.
జ్యోతి ఏం చేసింది?
ట్రావెల్ వ్లోగర్ అయిన జ్యోతిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు తమకి సమాచారమిచ్చే అక్షయ పాత్రలా తయారు చేసుకున్నారు. భారత, పాకిస్థాన్ ల మధ్య ఇటీవల కాలంలో రేగిన ఉద్రిక్తతలు, ఘర్షణలపై కీలక సమాచారం జ్యోతి పాక్ ఐఎస్ ఐ అధికార్లకు ఎప్పటికప్పుడు చేరవేసింది.అయితే అదృష్టమేమంటే రక్షణ పరమైన కీలక సమాచారమేదీ ఆమెకు నేరుగా యాక్సిస్ లేకపోవడం.పాకిస్థాన్ ఐఎస్ ఐ సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను వాడుకుని తమకు అనుకూలమైన కథనాలను సృష్టించి ప్రజలకు వదులుతున్నారని మన దర్యాప్తు బృందాలు అంచనా వేస్తున్నాయి. మల్హోత్రా ఇందులో ఒక పావు మాత్రమే. భారత, పాకిస్థాన్ యుద్ధం సమయంలో కూడా ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్ లో ఉన్నట్లు తేలింది. మే 6న ఆపరేషన్ సిందూర్ కు ఒక రోజు ముందు ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ హై కమిషన్ సిబ్బందిలో ఒకరైన డానిష్‌ను కలిసిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
దాడికి మూడు నెలల ముందు పెహల్గాంకు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం జ్యోతి ఈమధ్య కాలంలో అనేక సార్లు స్పాన్సర్డ్ ట్రిప్పులకు వెళ్లింది.పెహల్గాం దాడులకు ముందు వరకూ జ్యోతి చాలాసార్లు పాకిస్థాన్ వెళ్లినట్లు సాక్ష్యాలున్నాయి. గూఢచర్యంలో ఇది లేటెస్ట్ ట్రెండ్.. అందుకే పోలీసులు ఇప్పుడు జ్యోతి బ్యాంకు లావాదేవీలపైనా, ఆమె యూ ట్యూబర్ పేరుతో వినియోగించిన పరికరాలపైనా దృష్టిపెట్టారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఈ గూఢచర్యం వివరాలు బయటకొస్తాయి. బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత ఆమె ఆర్థిక స్థితి, ఎన్నిసార్లు పాక్ ప్రయాణించింది, మొత్తం ఆదాయం ఎంత అన్నది అర్ధమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిపిన దర్యాప్తు ప్రకారం ఉగ్రదాడికి మూడు నెలల ముందు ఆమె పెహల్గాం సందర్శించింది.
పాకిస్థానీ హై కమిషన్ ఉద్యోగి డానిష్ ఈ ఏడాది జనవరిలో పెహల్గాం సందర్శించాడు. డానిష్ వలపు వల విసిరి ఆమెను ట్రాప్ చేశాడని, వీరిద్దరూ ఒకేసారి పెహల్గాం వెళ్లడం కాకతాళీయమా? లేక పథకమా అన్నది తేలాల్సి ఉందని అధికారులు అంటున్నారు.మన వ్యతిరేక దేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ లను పదే పదే ఎవరైనా సందర్శిస్తుంటే వారిపైనా వారి కదలికలపైనా సాధారణంగా ఇంటెలిజెన్స్ సర్వీసులు నిఘా పెడతాయి.
కేక్ డెలివరీ బోయ్ తో జ్యోతి!!
మరోవైపు పాకిస్థాన్ ఐఎస్ ఐతో జ్యోతికి సంబంధాలున్నాయనడానికి రోజుకొక ఆధారం బయటపడుతోంది. పాకిస్థానీ పౌరుడు డానిష్ తో ఆమె నిరంతర సన్నిహిత సంబంధాలు మరిన్నివెలుగులోకి వచ్చాయి.పెహల్గాం దాడిలో 26 మంది అమాయకులు మరణించిన రెండు రోజుల తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కు కేక్ డెలివరీ చేసిన ఒక బోయ్ తో ఆమె ఓ ఫోటో లో కనిపించింది.ఆ కేక్ డెలివరీ చేసిన వ్యక్తిని ఈమధ్యే అరెస్టు చేశారు.అదీకాక పాకిస్థాన్ వెళ్లినప్పుడు జ్యోతి అక్కడ ఒక పార్టీలో పాల్గొంది. అందులో ఒక వీడియోను కూడా రికార్డు చేసింది. ఆ వీడియోలో ఈ కేక్ డెలివరీ బోయ్ తో ఆమె మంతనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బోయ్ ని అక్కడే ఉన్న విలేకరులు కేక్ దేనికి తెచ్చారు? సంబరాలు చేసుకోడానికి కారణమేంటి అని అడగ్గా అతను సమాధానమిచ్చేందుకు నిరాకరిస్తూ వెంటనే అక్కడనుంచి తప్పుకున్నాడు.
ఆలయాలు టార్గట్ చేశారా?
ఇదిలా ఉంటే జ్యోతీ మల్హోత్రా 2024లో పూరి జగన్నాథ్ ఆలయం కూడా సందర్శించింది.అక్కడ ఆమె స్థానిక తీర ప్రాంత పట్టణానికి చెందిన మరో యూ ట్యూబర్ ను కలిసిందని పూరీకి చెందిన వినీత్ అగర్వాల్ అనే పోలీసు అధికారి చెబుతున్నారు. పూరీకి చెందిన ఈ మహిళ కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా ను కూడా సందర్శించింది. మన దేశంపై గూఢచర్యం చేసినందుకు మల్హోత్రాతో సహా అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.మనం చేపట్టబోయే ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్థాన్ ఐఎస్ ఐకి ఈమె ముందుగానే సమాచారం అందించిందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు.మన ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలు, ఎయిర్ బేస్ ల గురించి కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ ఐకి అందించారన్న కారణంగా పంజాబ్ కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.
ఈ గూఢచర్యం నెట్ వర్క్ అంతా ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారి ఆధ్వర్యంలో నడిచింది.ఈనెల 13న అతడిని మనదేశం బహిష్కరించింది.నిన్న ఇదే నెట్ వర్క్ కు చెందిన మరో యూపీ వాణిజ్యవేత్తను అరెస్టు చేశారు.స్మగ్లింగ్,గూఢచర్యం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై షాజాద్ ను మొరాదాబాద్ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఇదే స్పై నెట్ వర్క్ కు చెందిన వాడా కాదా అన్నది తేలాల్సి ఉంది.