బాలీవుడ్ హీరోయిన్ వాణీకపూర్ హిందీ, తెలుగు, తమిళం సినిమాల్లో నటించింది. చండీగఢ్ కరే ఆషికి సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా నటించి ప్రశంసలు అందుకుంది. జిరాఫీలా ఉండే వాణీకపూర్ వయ్యారాల ఫోటోలకు సోషల్ మీడియాలో భలే క్రేజ్ ఉంది.
పంజాబీ కుటుంబానికి చెందిన వాణీకపూర్ 1988లో ఢిల్లీలో జన్మించింది.
టూరిజం స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన ఈ బ్యూటీ జైపూర్‌లోని ఒబెరాయ్ హోటల్స్ లో ఇంటర్న్‌షిప్ చేసింది.
వాణీకపూర్ ఐటిసి గ్రూపులో పనిచేసిన అనుభవంతో మోడలింగ్ లోకి వచ్చింది
యష్ రాజ్ ఫిల్మ్స్‌తో మూడు చిత్రాలకు ఒప్పందం కుదరటంతో వెండితెరపై వాణీకపూర్ కెరీర్ ప్రారంభమైంది.
2013లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పరిణీతి చోప్రాతో పాటు రొమాంటిక్ కామెడీ శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాలో సహాయక పాత్రకు అడిషన్స్ ద్వారా ఎంపికైంది.
హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ సినిమాకు తమిళం, తెలుగులో రిమేక్ ఆహా కళ్యాణం.
ఆహా కళ్యాణంలో నానీ సరసన నటించిన వాణీ…ఈ సినిమా కోసం తమిళం నేర్చుకుంది
2021లో అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన బెల్ బాటమ్ సినిమాతో పాపులారిటీ వచ్చింది
courtesy:instagram