20 పూరి గుడిసెలు దగ్దం… 6 మందికి తీవ్ర గాయాలు
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని భైరవపట్టణం అనే గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 20 గుడిసెలు దగ్దమై పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, మహిళలతో సహా మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దోమల నివారణకు మస్కిటో క్వాయిల్ అంటించడంతో గుడెశెలో మంటలు వ్యాపించి చివరికి గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరుకు చెందిన వేటగాళ్ళు భైవరపట్టణం హైవే పక్కన గుడిసెలు వేసుకుని అక్కడ 20 ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నారు. కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులను వేటాడి జీవిస్తుంటారు. ఈ పక్షులను బిదిరించే నాటు తుపాకీలో వాడే ముందుగుండు సామగ్రిపైకి మస్కిటో క్వాయిల్ నిపప్పు రవ్వలు ఎగిరిపడటంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వేటగాళ్ళు వేటాడి పట్టుకున్న అనేక పక్షులు కూడా అగ్నికి ఆహుతై మృతి చెందాయి.