ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధపై నేరస్తులకు భయం లేకుండా పోయిందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాణ వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో నేరాలు తీవ్రంగా నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. సోమవారం శాసనమండలిలో చర్చ సందర్భంగా ఆయన పలు అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని బొత్స ఆరోపించారు. ఎన్నికల ముందు దీపం పధకంపై విపరీతమైన ప్రచారం చేసి తీరా ఇప్పుడు బడ్జెట్ లో సరిపడా నిధుల కేటాయించలేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ఒకలాగా పౌరసరఫరాల శాఖ మంత్రి మరోలా మాట్లాడి దీపం పధకానికి మెలిక పెడుతున్నారని అన్నారు. తల్లికి వందనం పేరిట 18 వేలు ఇస్తామన్న హామీ ఇప్పుడు ఎందుకు అమలు చెయ్యడం లేదని నిలదీశారు. విద్యుత్ ఛార్జీలు ఇష్టానుసారం పెంచితే ఎలా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో డిస్కంలకు సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. మా హాయాంలో పెట్టుబడి వ్యయం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని, నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, మెడికల్ కళాశాలలు ఎలా వచ్చాయని మండలిలో బొత్స ప్రశ్నించారు.
- Advertisement with us -