25 C
Hyderabad
Wednesday, November 4, 2026

Live Video

spot_img

ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

బాయిలర్ పేలడంతో జరిగిన ఘటన

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పెలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా చాలాసేపు మంటలు అదుపులోకి రావడం లేదు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండటంతో కార్మికులు, నిర్వాహకులు భయందోళనకు గురౌతున్నారు. పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రామేశ్వరం శివారు అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ ఆయిల్ కంపెనీలో బాయిలర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం అర్థరాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు ప్రయత్నం చేస్తున్నా మంటలు అదుపులోకి రావడంలేదు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండడంతో కార్మికులు నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు. షిఫ్ట్ లో 30 మంది పని చేస్తున్నట్లు కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కంపెనీ వర్గాలు తెలియజేశాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com