36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌తో పాటు.. ఆ కంపెనీ ఆఫీసులున్న చేవెళ్ల, షాద్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో తనికఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని స్వస్తిక్‌ రియల్టర్‌ కంపెనీలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్‌ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్‌సీ కపెంనీకి స్వస్తిక్‌ సంస్థ రూ.300 కోట్లతో భూమి విక్రయించింది. స్వస్తిక్‌ గ్రూప్‌ షాద్‌ నగర్‌లో ఈ భూమిని ఎంఎన్‌సీ కంపెనీకి అమ్మింది. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించిన వివరాలు బ్యాలెన్స్‌ షీట్స్‌లో చూపలేదని ఐటీ అధికారులు గుర్తించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com