ప్రభుత్వ పనితీరు, రాజకీయ స్ధితిగతులపై సర్వేలు కొంత రహస్యంగా నిర్వహించుకుంటారు. అయితే సాధారణంగా హౌస్ హోల్డ్ సర్వేలు నిర్వహించినప్పుడు దానికి విస్తృత ప్రచారం కల్పిస్తాయి ప్రభుత్వాలు. ప్రజల మేలు కోరి ఈ సర్వేలు నిర్వహిస్తున్నామని అట్టహాసంగా ప్రకటను గుప్పిస్తూ ఉంటాయి. సర్వే ఉద్దేశాలు, ఏ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది… అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. సర్వేకు సహకరించమని అభ్యర్ధిస్తాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం రహస్యంగా ఒక సర్వే చేపట్టింది. ఎవరికీ లీక్ కాకుండా, మీడియాలో ఎక్కడా ప్రకటను కూడా ఇవ్వకుండా రహస్యంగా ఒక సర్వే నిర్వహిస్తోంది. నవంబర్ 9వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే మరో వారం రోజుల్లో ముగియనుంది. సర్వే డెడ్ లైన్ 25వ తేదీ వరకూ పెట్టారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గడచిన తొమ్మిది రోజులుగా ఈ సర్వే చేస్తున్నారు. ఇంటి ఫోటో ఆ ఇంట్లో నివసిస్తన్న వారి ఫోటోతో పాటు బయోమెట్రిక్ ను కూడా తీసుకుంటున్న ఈ సర్వేకు హౌస్ హోల్డింగ్ రీ మ్యాపింగ్ సర్వే అని నామకరణం చేశారు. పంచాయితీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. అయితే ఈ సర్వే పూర్తయిన తరువాత కూటమి ప్రభుత్వం దీన్ని ఏరకంగా ఉపయోగిస్తుందో వేచిచూడాలి.
- Advertisement with us -