28.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

రాశిఫలాలు…19.01.25 నుండి 25.01.25 వరకు

  • ఈవారం ముఖ్య పండగలు..పర్వదినాలు…
  • 25 శనివారం సర్వ ఏకాదశి.

రాశిఫలాలు…19.01.25 నుండి 25.01.25 వరకు

మేషం…(అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అదనపు రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి.వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు అనూహ్యంగా ఉద్యోగలాభం.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా  సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. నాయకులు, కళాకారుల కృషి ఫలించే సమయం. 19,20 తేదీల్లో దూరప్రయాణాలు. ధననష్టం. చికాకులు.  విష్ణుధ్యానం చేయండి.

వృషభం…(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

సన్నిహితుల నుంచి కొంత సహాయం అర్థిస్తారు. ఎవరి సహాయం లేకుండా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా సాగిస్తారు. గతంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు గుర్తుకు వస్తాయి. విచిత్రమైన విషయాలు తెలుస్తాయి..  స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు కుదురుతాయి. ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన సొమ్ము అంది అవసరాలు తీర్చుకుంటారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. కొన్ని వివాదాలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ప్రగతిపథంలో కొనసాగి ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగస్తులకు కృషి ఫలిస్తుంది. కళాకారులు, వైద్యులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 21,22 తేదీల్లో ఖర్చులు అధికం. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా. గణేశాష్టకం పఠించండి.

మిథునం..(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మలుచుకుంటారు. మీసత్తా, ప్రతిభ అందరిలోనూ ప్రకటితమవుతాయి. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు పొందడానికి చేసే యత్నాలు కలసివస్తాయి. అనుకున్న రాబడి పొంది ఉత్సాహంగా గడుపుతారు.. ప్రత్యర్థులు మీకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల కల ఫలించే సమయం. వ్యాపారాలు విస్తరించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలు అభివృద్ధిపథంలో కొనసాగుతాయి. పరిశోధకులు, డాక్టర్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగి విజయాలు సాధిస్తారు. 22,23 తేదీల్లో మానసిక సంఘర్షణ. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..(పునర్వసు 4వ పాదం, పుష్యణి, ఆశ్లేష)

ఏ కార్యక్రమం చేపట్టినా అవరోధాలు ఎదురై చికాకు పరుస్తాయి. పరీక్షా సమయంగా భావించాలి. శత్రు, రుణఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకున్న రాబడి దక్కక ఇబ్బంది పడతారు. బంధువులు,స్నేహితులు మీపై అపవాదులు మోపి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. మనోనిబ్బరంతో ముందడుగు వేయడం మంచిది. నిర్ణయాలపై తొందరపాటు వద్దు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది.వ్యాపారాలు ముందుకు సాగక ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు శ్రమే మిగులుతుంది. 20,21 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.

సింహం…(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఇంతకాలం మీ కృషి ఫలించి కొన్ని విజయాలు సాధిస్తారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. సంఘంలో గౌరవం, పేరుప్రతిష్ఠలు పొందుతారు. ప్రత్యర్థులు మీ విజయాలపై కలత చెందుతారు.. కుటుంబసభ్యులతో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ సహనమే రక్షగా నిలుస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు పొందుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. డాక్టర్లు, పరిశోధకులు, సినీరంగం వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి కనిపిస్తుంది. 24,25 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కొన్ని ఒత్తిడులు ఎదురవుతాయి. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కన్య…(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ప్రారంభంలో చికాకులు, చిక్కులు ఎదురై మీసహనాన్ని పరీక్షిస్తాయి. ఒక సందర్భంలో బంధువులు మీపై విమర్శలు చేయడంతో మనస్తాపం చెందుతారు. అయితే క్రమేపీ మీకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో ఆప్యాయత, అనురాగం పంచుకుంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అరుదైన సన్మానాలు జరుగుతాయి.  వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగుల కృషి ఫలించి ఉత్సాహంగా సాగుతారు. నాయకులు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19,20 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. కొన్ని ఇబ్బందులు రావచ్చు. గణేశాష్టకం పఠించండి.

తుల…(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

అనుకున్న కార్యాలలో విజయాలు సాధిస్తారు. మీరు ఊహించిన విధంగానే డబ్బు అందుకుంటారు. విద్యార్థులు ప్రతిభపాటవాలు, నైపుణ్యం వెలుగులోకి రావడంతో మంచి గుర్తింపు పొందుతారు. జీవితాశయ సాధన కోసం శ్రమించే మీకు సోదరులు, హితుల నుంచి సాయం అందుతుంది. కష్టాలను అధిగమించి ముందుకు . ఒక లేఖ ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. భూసంబంధిత వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వాహన, గృహæ యోగాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలలో  ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పైఅధికారుల ఆదరణ లభిస్తుంది.  నాయకులు, పరిశోధకులకు ఒత్తిడులు తొలగుతాయి. 23,24 తేదీల్లో దుబారా వ్యయం. ఇంటాబయటా చికాకులు. ఆప్తులతో విభేదాలు.. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం…(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. కార్యోన్ముఖులై అనుకున్న విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెంచుకుంటారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. కొన్ని నిర్ణయాలు మీ సమర్థతను చాటతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు సహాయం పడతారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే సూచనలు. న్యాయవాదులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, టెక్నాలజీ వారు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. 22,23 తేదీల్లో దూరప్రయాణాలు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా. శ్రమ తప్పదు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు…(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఉన్నంతలో ఎదుటివారికి సహాయపడి మంచితనాన్ని నిరూపించుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.  దూరపు బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చిరకాల కోరిక నెరవేరే సమయం. మీ ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ప్రత్యర్థులను మాటలతో ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.   వ్యాపారాలలో కొద్దిపాటి అవరోధాలు పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. డాక్టర్లు, లాయర్లకు సమస్యలు తీరతాయి. 19,20 తేదీల్లో మానసిక ఆందోళన. కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్యం. కాలభైరవాష్టకం పఠించండి.

మకరం..(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

దూరపు బంధువులు శుభవార్తలు అందిస్తారు. సమస్యలు, ఇబ్బందులు తొలగి ప్రశాంత జీవనం సాగిస్తారు. మీలోని పట్టుదలకు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి విలాసవంతంగా గడుపుతారు. వ్యవహారాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. కొన్ని విషయాలో మధ్యవర్తిగా వ్యవహరించి మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలలో అడుగు ముందుకు పడుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది, అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. నాయకులు, కళాకారులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. 21,22 తేదీల్లో ప్రయాణాలలో మార్పులు. కొన్ని వివాదాలు చికాకుపరుస్తాయి.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం….(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా కొనసాగిస్తారు. చిరకాల స్వప్నం çఫలిస్తుంది. బంధువులు, స్నేహితులతో సంతోషాన్ని పంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కొన్ని అగ్రిమెంట్లు కుదుర్చుకుని మీ సమర్థతను చాటుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఊహించని రీతిలో ఉద్యోగయోగం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ అభిప్రాయాలను బంధువులు మన్నిస్తారు. శత్రువిజయం. వ్యాపారాలు మరింతగా కలసివస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి కలుగుతుంది. నాయకులు, పరిశోధకులకు విజయాలు వరిస్తాయి. 22,23 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెడుతుంది. గణేశ్‌ను పూజించండి.

మీనం…(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరబాద్ర, రేవతి)

అనుకున్న కార్యాలు చక్కదిద్దుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. నైపుణ్యతను చాటుకుని ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. పదిమందిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. బంధువులను కలుసుకుని చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒక సమాచారం  సంతోషం కలిగిస్తాయి. కళాకారులు, డాక్టర్లకు అన్నింటా విజయాలు చేకూరతాయి. 24, 25 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com