వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 10 నుంచి 19 వరకు తిరుమలలో శ్రీవారి భక్తులకు కలియుగ వెంకటేశ్వరుడి సర్వ దర్శనం రద్దు చేశారు. మళ్ళీ ఆ దర్శనాన్ని తిరిగి పునరుద్దరించనున్నారు. ఈ నెల 20 నుంచి భక్తులు యథావిధిగా స్వామి వారిని సర్వ దర్శనంలో వెళ్లి దర్శించి రావచ్చు. నిజానికి ఎప్పుడైనా స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే, ఒకరోజు ముందుగా టోకెన్లు తీసుకోవాలి. కానీ 20వ తేదీ ఒక్కరోజు టోకెన్లు ఉండవు. అందువల్ల భక్తులు 20 వ తేదీన మాములుగా క్యూ లైన్ లో వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత నుంచి యథాతథంగా ఎప్పటిలా టోకెన్ల వ్యవస్థ నడుస్తుంది. ఎప్పటిలా ఒకరోజు ముందు సర్వ దర్శనం టోకెన్లు దిగువ తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ల్లో ఇవ్వనున్నారు.
అయితే 19వ తేదీన బ్రేక్, వీఐపీ దర్శనాలు, సిఫారసు లెటర్లు రద్దు చేసినట్టు ఈవో శ్యామల రావు చెప్పారు. టీటీడి అధికారుల సమావేశంలో ఈవో సమీక్షించారు. ఆయనతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో రామ బ్రహ్మం, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.