భోగి పండగ ఈ ఏడాది అరుదైన శుభ యోగంలో వచ్చింది. 110 ఏళ్ల తర్వాత పుష్య మాసం పౌర్ణమి తిధి, సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. అంతేకాదు ఈ పౌర్ణమి శుక్ల పక్షం చివరి తిధి. ఈ రోజున నదీ స్నానం, వస్తువులను దానం చేయడం చాలా ముఖ్యం. పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలాభం కలుగుతుందని మత విశ్వాసం.
తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు కోలాహలంగా ప్రారంభం అయ్యాయి. ఉభయ రాష్ట్రాల్లో జరిగిన సంబరాల్లో రాజకీయ నాయకులు, అధికారులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
భోగి సందర్భంగా హైదరాబాద్ శివారు మేడిపల్లిలోని కుమారుని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి భోగి మంటలు వేయడం, ఇతర సంప్రదాయ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన భోగి సంబరాల్లో బీఆర్ ఎస్ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ కెబిఆర్ పార్కు వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
ఏపి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురుందేశ్వరి పరుచూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు గిత్తలతో ఎడ్ల బండి వద్ద దిగిన ఫోటో ఆకట్టుకుంటోంది.
మాజీమంత్రి, వైసిపి శాసనమండలి పక్షనేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో జరిగిన బోగి వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. సంబరాల్లో బొత్స భార్య మాజీఎంపి బొత్స ఝాన్సీ ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
విజయవాడలోని టిడిపి కార్యాలయంలో జరిగిన భోగి సంబరాల్లో ఎంపి కేశినేని శివనాథ్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.
తిరుమలలో జరిగి భొగి సంబరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కూడళ్ళలో జరిగిన భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి