హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అశోక్ యాదవ్, నిత్యానందం, సర్పరాజు, బుక్క వెంకటేశం ఆధ్వర్యంలో వందలాదిమంది కార్యకర్తలు జడ్చర్ల నేతాజీ చౌరస్తా వద్దకు వచ్చి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి సత్కరించారు. బాణాసంచా కాల్చి సందడి చేశారు. బంతిపూల వర్షాన్ని కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వరకు అడుగడుగున కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే షాద్ నగర్ పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ శ్రేణులు డిప్యూటీ సీంయ భట్టి విక్రమార్క్ కు అట్టహాసంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నియోజకవర్గ రైతులు వినతిపత్రం అందజేశారు.