35.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

టీడీపీ సేవలో టీటీడీ చైర్మన్‌, ఈవో, జేఈవోలు… అంబటి రాంబాబు

టీటీడీ చైర్మన్‌, ఈవో, జేఈవో ఈ ముగ్గురూ టీడీపీ సేవలో మునిగి పోయి టీటీడీ సేవను విస్మరించడం వల్లే తిరుమలలో తొక్కిసలాట వంటి దురదృష్టకర సంఘటన జరిగిందని మాజా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరుగు ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరని అంబటి ప్రశ్నించిన అంబటి ఈ ముగ్గురు వచ్చినప్పటి నంచి కొండపైన అన్నీ వివాదాలే అని విమర్శించారు. వైఎస్ జగన్ కొండ మీదకు వస్తున్నారనగానే బోర్డులు పెట్టారని… జగన్ రావటంలేదు అనగానే ఆ బోర్డులు తీసేశారని అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేశారు. ఇక బీఆర్ నాయుడుకి దేవుడి మీద భక్తి లేదని మా మీద పూర్తిగా విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కొండ మీద రాజకీయాలు చేసి జగన్ ని అడ్డుకునే ప్రయత్నాలే చేశారని స్వామివారి చెంతన పాపాలు, ద్వేషాలు కొనసాగితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని అందుకే ఏడుకొండల్ని పవిత్రంగా చూడమని రాంబాబు హితవు పలికారు. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఏం చెప్తారని అంబటి నిలదీశారు. పీఠాధిపతులు, స్వామీజీలు బయటకు వచ్చి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలుగు దేశం సేవలో ఉన్నారని ఆయన ఎటువంటి వారంటే అఘాయిత్యానికి గురైన బాలికను పరామర్శించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద ఫోక్సో కేసు పెట్టిన ఘనుడు ఎస్పీ అని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోకపోతే వారి ఆత్మలు శాంతించవు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల తొక్కిసలాటపై ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com