తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన చంద్రబాబునాయుడి అసమర్ధ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కేరోజా విమర్శించారు. టీటీడీ చైర్మన్, ఎస్పీ, కలెక్టర్ల అసమర్ధత వల్లనే ఈ ఘటన జరిగిందని రోజా అన్నారు. చంద్రబాబు భజన తప్పితే వీరెవరికీ భక్తిభావం లేదని మండిపడ్డారు. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసుండి కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆమో డిమాండ్ చేశారు. అల్లు అర్జున్‌కి సంబంధం లేకపోయినా ఆయనపై కేసులు పెట్టారు మరి తిరుమల ఘటనలో చంద్రబాబు, బీఆర్‌నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలి కదా అని రోజా నిలదీశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై బీఎన్‌ఎస్ సెక్షన్ 105 పెట్టాల్సి ఉండగా 194 సెక్షన్ ఎలా పెడతారని రోజా నిలదీశారు. తిరుమలలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. పీఠాధిపతులు బయటకు వచ్చి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని రోజా నిలదీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని… సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని రోజా ప్రశ్నించారు. గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్ మీద ఉన్న శ్రద్ద శ్రీవారి భక్తుల మీద ఎందకు చూపించడం లేదని రోజా అడిగారు. టీటీడీని టీడీపీ ఆఫీసులాగమార్చేశారని వైకుంఠ ఏకాదశికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో టీటీడీ ఛైర్మన్ కు తెలీదు… ఆయనకు భక్తిభావమే లేదు… అలాంటి వారికి ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని మాజీ మంత్రి ఆర్కేరోజా తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
- Advertisement with us -