హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు బిఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మేకల విద్యాసాగర్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు పోలీసులు తీసుకెళ్లారు. విచారణ పేరుతో ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.