వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంనాటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ శాసనసభలో ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సమాధానం ఇచ్చారు. ఎటువంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశమని లోకేస్ స్పష్టం చేశారు. 1994 నుంచి కేసుల వివరాలు అధ్యయనం చేస్తున్నామని, పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.